ఘనంగా రాజీవ్ జయంతి వేడుకలు

డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి
స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి వేడుకలు మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం, డోర్నకల్ నియోజకవర్గ నాయకులు మాలోతు నెహ్రూ నాయక్ సూచనల మేరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు.భారతదేశానికి ఐటీ రంగాన్ని,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించిన ఘనత రాజీవ్ గాంధీకి చెందుతుందన్నారు.శాంతి స్థాపన కోసం రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారన్నారు.గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం అన్నారు. ఆనాడు చేసిన అభివృద్ధితో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని తెలిపారు.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో నాయకులు,కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అన్నారు.నెహ్రూ నాయక్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త హస్తం కలపాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం పేదలకు దుప్పట్లు పంచారు.కార్యక్రమంలో వీరస్వామి,పవన్,బుట్టి అరుణ,బానోతు శ్రీను, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.