ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం
జనం సాక్షి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణం కనుల పండుగ గా జరిగింది దీనికిగాను తూర్పాటి సతీష్ కళ్యాణం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కథలాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి కళ్యాణం చేయనున్నట్లు తెలిపారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బొంగు నడిపి సత్యనారాయణ గౌడ్, రాధారావు సురేష్, కొత్తపల్లి శేఖర్, సతీష్ గౌడ్, శివ, కిషన్ రావు, అంజయ్య, రాధారావు కృష్ణ, షేక్ సుల్తాన్, కస్తూరి నరేష్, తారక్ తదితరులు పాల్గొన్నారు.