ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
శివ్వంపేట ఆగస్టు18, (జనంసాక్షి): మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రమైన శివ్వంపేటలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వివిధ గౌడ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన శివ్వంపేటలో గౌడ సంఘం నాయకులు పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు శివ్వంపేట నుంచి నర్సాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కావాలని పరితపించిన వ్యక్తి పాపన్న గౌడ్ అన్నారు. అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యాధికారం ఉండటం వల్ల నిమ్న జాతులకు తీరని అన్యాయం జరుగుతుందని, ఆదిశగా బహుజనుల్ని ఏకం చేసి పోరాటం చేసిన యోధుడన్నారు. ఆ ప్రయత్నంలో గోల్కొండ కోట పై జెండా ఎగరేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడని వారు కీర్తించారు. ఈ కార్యక్రమం లో టీఆరెఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, కొంతాన్ పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గూడూరు సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, పంబండ రాజశేఖర్ గౌడ్, కొత్తపేట శేఖర్ గౌడ్, పెద్ద గొట్టి ముక్ల మహేష్ గౌడ్, నవాబు పేట సురేష్ గౌడ్, చెన్నాపూర్ రాంచంధర్ గౌడ్, చెంది ప్రవీణ్ గౌడ్, దొంతి మోహన్ గౌడ్, పంబండ నవీన్ గౌడ్, నర్సింగ్ గౌడ్, శివంపేట మండల గౌడ నాయకులు ఉన్నారు.