ఘనంగా సులానగర్ ఆర్ సి ఎం చర్చి 28వ వార్షికోత్సవం
పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికిన సులానగర్ క్రైస్తవులు
— పునీత మిఖయేల్ దేవాలయ 28వ వార్షికోత్సవం
టేకులపల్లి సెప్టెంబర్ 29( జనం సాక్షి ): సులానగర్ గ్రామంలో రోమన్ క్యాథలిక్ మిషన్ చర్చి ప్రారంభించి 28 సంవత్సరాలు అయిన సందర్భంగా క్రైస్తవులు గురువారం పునీత మిఖాయేల్ దేవాలయ 28వ వార్షికోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తొలిసారి నూతన బిషప్ ( పీఠాధిపతి) మహారాజు శ్రీశ్రీ శ్రీ ఉడుమల బాల వరంగల్ పీఠాధిపతి, ఖమ్మం పీఠాధిపతి లకు క్రైస్తవ భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. సులానగర్ ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ తీస్తూ బాణాసంచా కాల్చారు. అనంతరం సులానగర్ క్రైస్తవ భక్తులు కోలాటం నృత్యాలను ప్రత్యేకంగా నేర్చుకొని పీఠాధిపతులకు కోలాటం నృత్యాలతో ఘన స్వాగతం పలికారు . ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్న ఫాదర్లు అందరూ ఈ వార్షికోత్సవానికి హాజరయ్యారు. అనంతరం పీఠాధిపతులచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులందరికీ చక్కటి విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో
ఆర్ సి ఎం సంఘ సభ్యులు, బల్లెం సురేష్, బల్లెం బిక్షం, అంతోటి నాగేశ్వరరావు, ఉండేటి బసవయ్య , ఉండేటి ప్రసాదు, ఉండేటి ధర్మరాజు ,ఉండేటి ఇరిమియా, కర్లపూడి నాగయ్య, సామేలు, చర్చి యూత్ తదితరులు పాల్గొన్నారు.