చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌కు కలిసిన శాసనసభ్యులు
చంచల్‌గూడ(హైదరాబాద్): అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిని ర్నూలు జిల్లాకు చెందిన శాసనసభ్యులు మంగళవారం కలిశారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌లు ఆయన్ను కలిశారు. ఆయన భార్య భారతీరెడ్డి కూడా జగన్‌ను కలిశారు.