చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

-జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని

సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిష ధ్వని తెలిపారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఉపనిష ధ్వని మాట్లాడుతూ చట్టాలు, అవి కల్పించే రక్షణ గురించి విపులంగా వివరించారు. బాలికలు, స్త్రీలపై జరిగే అఘాయిత్యాల పట్ల తీసుకునే చర్యలను జడ్జి వివరించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక న్యాయవాది రాజలింగు మోతె ముద్రించిన ఉచిత న్యాయ సహాయం సేవలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జడ్జి ఎండి.అసదుల్లా షరీఫ్, స్థానిక పట్టణ ఎస్ఐ అశోక్, మంచిర్యాల బార్ అసోసియేషన్ కోశాధికారి కే. గంగయ్య, న్యాయవాదులు ఎండి. తాజుద్దీన్, రాజలింగు మోతె, సమతా రాణి తదితరులు పాల్గొన్నారు.