చదువుకున్న వారికే ప్రత్యేక గుర్తింపు : ఎంపీటీసీ ఆదిల్​ అహ్మద్​

విద్యార్థికి రూ.20 వేల నగదు,మెమంటో బహూకరణ
పరిగి రూరల్​, సెప్టెంబర్​ 14 ( జనం సాక్షి ) :
చదువుకున్న వారికే సమాజంలో మంచి గుర్తింపు ఉందని  మన్నెగూడ ఎంపీటీసీ, ఆదిల్​ గ్రూప్స్​ చైర్మన్​, మైనార్టీ నాయకులు మస్రత్​ సయ్యద్​ ఆదిల్​ అహ్మద్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన్నెగూడ ఎంపీటీసీ మస్రత్​ సయ్యద్​ ఆదిల్​ అహ్మద్​ మాట్లాడుతూ చదువుకున్న వారు ఎక్కడికెళ్లినా బతుకవచ్చాన్నారు. చదువుకుంటేనే మనతోపాటు మన కుటుంబం, సమాజం బాగుపడుతుందన్నారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి పేదరికంలో ఉన్న వారిని ప్రొత్సహించేందుకు తాను సిద్దంగాఉంటానన్నారు. మండల పరిధిలోని మిర్జాపూర్​ గ్రామానికి చెందిన ఎండి.ఆదిల్ మన్నెగూడ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో చదివి 10/10 గ్రేడ్​ సంపాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థి ప్రతిభనను గుర్తించిన ఎంపీటీసీ మస్రత్​ సయ్యద్ ఆదిల్​ అహ్మద్​  విద్యార్థి ఆదిల్​ కు రూ.20 వేల నగదు బహుమతి, మెమంటో అందజేశారు. అనంతరం ఉపాధ్యయ దినోత్సవం జరుపుకున్న ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్తులను గుర్తించి వారిని విద్యాపరంగా ప్రొత్సహించడం చాలా సంతోషకర విషయమని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు రత్న ఎంపీటీసీ ఆదిల్​ అహ్మద్​ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్నెగూడ సర్పంచ్​ అబ్దుల్​ హాసిబ్​, ఉప సర్పంచ్​ కె. బుచ్చయ్య, ఎస్​ఎంసీ చైర్మన్​ దత్తాత్రేయ, గ్రామస్తులు జాహేద్​, బాలమని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
14 పిఆర్​ జి 01లో ఉత్తమ ప్రతిభ కనబరినిన విద్యార్తికి 20 వేల నగదు బహుమతి అందజేస్తున్న ఎంపీటీసీ మస్రత్​ సయ్యద్​ ఆదిల్​ అహ్మద్​ తదితరులు
Attachments area