చనిపోయిన 4 రోజుల తర్వాత స్వైన్‌ఫ్లొ నిర్దారణ
వరంగల్,మార్చి3(జనంసాక్షి):వరంగల్ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మృతికి స్వైన్‌ఫ్లొనే కారణమని వైద్యులు నిర్దారించారని స్థానిక వైద్యాధికారులు మంగళవారం తెలిపారు. ఆ వ్యక్తి మృతికి స్వైన్‌ఫ్లొ కారణం కావచ్చన్న అనుమానంతో ఎంజీఎం వైద్యులు నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఇని/-టసిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వారికి పరీక్ష నిమిత్తం పంపించారు. స్వైన్‌ఫ్లొ కారణంగానే అతను మృతి చెందినట్లు వారు నిర్దారించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రఘునాథపల్లి మండలానికి చెందిన మరో వ్యక్తికి కూడా స్వైన్‌ఫ్లొ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. జిల్లాలో రెండు స్వైన్‌ఫ్లొ కేసులు నమోదు కావడంతో వైద్యఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.