చర్చల పేరుతో కాలయాపన ఇంకెన్నాళ్లు : జే ఏ సి
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 23 (జనం సాక్షి): చర్చల పేరుతో కాలయాపన ఇంకెన్నాళ్లు? మణుగూరు జేఏసీ ఆగ్రహం సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాలు పెంచాలని గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే చర్చల పేరుతో సింగరేణి యాజమాన్యం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తుందని మణుగూరు జేఏసి నాయకులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె శుక్రవారానికి 15వ రోజుకు చేరుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన సెంట్రల్ లేబర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 60 ప్రకారం 30 శాతం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం నేడు దాని ఊసే ఎత్తకపోవడం విడ్డూరమన్నారు. వేతనాలు పెంచలేమని చెప్పడం భావ్యం కాదని జీవో నెంబర్ 22 గెజిట్ విడుదలకు ముఖ్యమంత్రి కి ఇంత వరకు రిఫరెన్స్ ఎందుకు పంపలేదని వారు ప్రశ్నించారు. 26 వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని, జీతాల పెంపు కోసం వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి జీవో నెంబర్ 22 ను గెజిట్ చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీపి కబురు చెప్పాలని వారు కోరారు. కార్మికుల జీతాలు పెంచే అంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇంతకాలం తక్కువ జీతంతో శ్రమ దోపిడీ చేశారు కాంటాక్ట్ కార్మికులంతా ఏకం కావాలి. ఓబి కాంట్రాక్టు కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎం నాగేశ్వరరావు, ఆర్ లక్ష్మీనారాయణ, అక్కి నరసింహారావు, గద్దల శ్రీను, ఎండీ గౌస్, గౌని నాగేశ్వరరావు, ఉప్పుతల నరసింహారావు, పీ వీరభద్రం, కాంట్రాక్ట్ కార్మికులు వి జానయ్య, సారయ్య, అమృత రావు,కే సతీష్ ,కృష్ణ రాము,ఎల్లమ్మ, ఇమాంబి తదితరులు పాల్గొన్నారు.