చిన్నోనిపల్లె గ్రామ భూ నిర్వాసితుల ను కలిసిన కాంగ్రెస్ నాయకులు..
గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామం లో చాలారోజుల
నుండి తమ భూములను రక్షించాలని,తమ గ్రామాన్ని,అస్తిత్వాన్ని కాపాడాలని తమకన్నీటి గోసను చూడాలని అలుపెరగని పోరాటం చేస్తున్న గ్రామ ప్రజలను కలిసిన *డా.కురువ విజయ్ కుమార్ మరియు తిరగబడడాం-తరిమికొడదాం గద్వాల నియోజకవర్గము కో-ఆర్డినేటర్లు వీరు బాబు,యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి,NSUI జిల్లా అధ్యక్షులు వెంకటేష్ .
✍️అనంతరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ దగ్గర రైతులతో కలిసి ధర్నా.
✍️ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు.
ఎన్నో సంవ్సరాలుగా భూమిని నమ్ముకుని,వ్యవసాయమే జీవనాధారంగా జీవనం కొనసాగిస్తుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రిజర్వాయార్ ను ఇప్పుడు అధికార పార్టీ పూర్తి చేయకపోగా కొందరు వ్యక్తులు ప్రజల భూమిని తక్కువ ధరలకే విక్రయించిప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు దండుకుని రైతులను మోసం చేస్తున్నారు.
ఎన్ని రోజులని రైతులని మోసం చేస్తారని ఆరోపించారు.
మా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు డా..కురువ విజయకుమార్
👉చిన్నోనిపల్లి గ్రామ రిజర్వాయర్ సామర్థ్యము 1.5 T.M.C. లతో ఆనాడు కాంగ్రెస్ ప్రాజెక్టును 101 ప్యాకేజి ద్వారా ప్రారంభిస్తే నేటికి పెండింగ్ లోనే పెట్టి రైతులను మోసం చేస్తుంది.
👉తక్షణమే రైతులకు ఎకరానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలి.
👉ముందుగా చిన్నోనిపల్లె భూ నిర్వాసితు లైన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
👉R&R ద్వారారైతులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి మౌలిక వసతులు కల్పించకుండా డ్యాం ను నిర్మించడం సబబు కాదు.
👉 గ్రామ ముంపుకు ప్రమాద కరంగా మారిన గండిని పూడ్చడం ద్వార నీరు గ్రామం లోకి ప్రవేశించి ప్రజల జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది..!
👉 గ్రామ షిఫ్టింగ్ కు 2013 చట్టం ప్రకారం 7 లక్షల రూపాయలు చెల్లించాలి.
👉 కాంట్రక్టర్లకు అధిక ముడుపులు చెల్లించి, రైతులను మాత్రం నట్టేట ముంచారు..!
👉2006 లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెట్ట భూమి ఎకరానికి 75 వేల రూపాయలు, తరి పొలానికి 95 వేలు చెల్లిస్తామని One Time Setilment అంటూ హామీ ఇచ్చినట్టే ఇచ్చి మాటతప్పారు.
👉 ఇంకా 40% పనులు అసంపూర్తిగా ఉన్నా బిల్లులు మాత్రం 90% చెల్లించారు..!
👉ఈ ప్రాంత BRS నాయకులు దాదాపుగా 200 ఎకరముల అసైన్డ్ భూమిని రికార్డ్ లో అక్రమంగా సృష్టించి,ఎకరానికి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం నుండి దోచుకుంటున్నారు..! దీనికి కారకులైన వారిపై సిట్టింగ్ జడ్జి తో సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం జరిగే వరకు ప్రజలకు అండగా నిలుస్తామని అదేవిదంగా ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఐన రైతులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఈ సంధర్బంగా డా.కురువ విజయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో తిరగబడడాం-తరిమికొడదాం గద్వాల నియోజకవర్గము కో-ఆర్డినేటర్ లు
వీరు బాబు.యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి,NSUI జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.