చీకటి ఒప్పందం బయటపడిరది
` మోడీ ` కేసీఆర్ ఫెవికాల్ బంధం
` గతంలోనే కాంగ్రెస్ ఈ నిజం చెప్పింది
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్ బ్యూరో (జనంసాక్షి):బీజేపీ `బీఆర్‌ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢల్లీిలో దోస్తీ ? గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం. మోడీ ఆశీసులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం. ఇప్పటికీ మోడీ ? కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం. నిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా నిగ్గుతేలక మానదు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని, బీజేపీ ? బీఆర్‌ఎస్ ఫెవికాల్ బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. గడచిన 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్ధతు ఉన్నదన్నది పార్లమెంట్ రికార్డులే చెబుతాయని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ఢల్లీి వెళ్లి చీకట్లో మోడీతో ఏయేం లాలూచీలు పడ్డాడో మోడీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం ` బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజం జాగురుకతతో ఉండి. ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.