చురుకుగా చెరువుల మరమ్మతులు

వరంగల్‌,మే6(జ‌నంసాక్షి):  మిషన్‌ కాకతీయ పథకం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టారు. భారీగా ప్రచారంతో ఈ పథకాన్నిచేపటట్డంతో పాటు అందుకు అనుగుణంగా నిధుల కేటాయించారు. ఈ చెరువుల సర్వేను పూర్తిచేసి నీటి పారుదలశాఖ అధికారులు నిధుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.  చెరువుల పునరుద్ధరణ పనులకు విడతలుగా  నిధులు కేటాయించినట్లు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు  వెల్లడించారు. ఇప్పటివరకు టెండర్ల పక్రియ పూర్తయి గుత్తేదార్లతో ఒప్పందాలు కూడా జరిగాయి. ఇదిలావుంటే మిషన్‌ కాకతీయ పనుల్లో అవినీతి ఆక్రమాలు జరిగితే సహించమని సీఈ సునీల్‌ అన్నారు. . మిషన్‌ కాకతీయ పనులు సక్రమంగా జరగలేదని, నాణ్యత లోపించాయని, డబ్బులివ్వనిదే పనులు అగ్రిమెంట్‌ కావడం లేదని మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు అందాయన్నారు. ఆయన ఆదేశాలతో విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు వాస్తవమని విచారణలో తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకొని, అనంతరం సమగ్ర విచారణ చేస్తామన్నారు.  అధికారులు లేదా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా అనే విషయమై ఆరాతీస్తున్నారు.