చురుకుగా ముందస్తు ఎన్నికల ఏర్పాట్లు

ఆరునెల్లలోగా ఎన్నికలు నిర్వహించాలి

చురుకుగా ఓటర్ల జాబితా

రాజకీయ పార్టీల సమక్షంలో ఇవిఎం పరిశీలన

విూడియాకు వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): అసెంబ్లీ రద్దు అనంతరం.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎక్కడా పేర్కొనలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల విధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడారు. ఓటర్‌ లిస్ట్‌లతో పోలింగ్‌ బూత్‌ల వారిగా విభజన జరుగుతోందన్నారు. ఓటర్‌ జాబితాలోని అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని.. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందాలని పేర్కొన్నారు.

ఓటర్లను చైతన్యపరిచేందుకు తమ యంత్రాంగం చర్యలు చేపట్టిందని రజత్‌కుమార్‌ వివరించారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్యపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సమక్షంలోనే ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్నామని చెప్పారు. మన దేశంలో ఈవీఎంల పనితీరు చాలా పక్కాగా ఉందని.. న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఈవీఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని చెప్పారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని నిబంధన ఉంది. 15, 16 తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్‌ బూత్‌ల వారిగా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఈవీఎం మిషన్లు రాగానే వాటిని రాజకీయ పార్టీల సమక్షంలోనే పరిశీలిస్తాం. ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 20లోగా రాష్టాన్రికి కావాల్సిన ఈవీఎంలు వస్తాయి. 52వేల బ్యాలెట్‌ యూనిట్లు రాష్టాన్రికి అవసరం. ఎన్నికల సందర్భంగా నగదు పంపిణీ చేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తాం. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. సోషల్‌ విూడియాలో ఎన్నికల ప్రచారంపైనా నిఘా ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఓటర్లను చైతన్య పరిచేందుకు మా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్య పరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు వద్దు.. మనదేశంలో ఈవీఎంల తీరు చాలా పక్కాగా ఉంది. న్యాయస్థానాల్లో ఈవీఎంలపై 37 కేసులు వేసినా అనుకూలంగా నిర్ణయం వచ్చిందని రజత్‌ కుమార్‌ చెప్పారు.