చెక్ పాయింట్ వద్ద వేగంగా దూసుకెళ్లిన కారు
దళాలు ఆపమన్నా ఆపకుండా వెళ్లడంతో కాల్పులు
న్యూఢల్లీి,అక్టోబర్8 (జనంసాక్షి) : కారు ఆపకుండా వెళ్లాడంటూ ఓ వ్యక్తిపై సిఆర్‌పిఎఫ్ దళాలు కాల్పులు జరిపిన ఘటన జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగింది. స్కార్పియో ఎస్‌యువి డ్రైవర్‌ని చెక్‌పాయింట్ (నఖా) వద్ద ఆపాల్సిందిగా సంకేతమిచ్చామని అధికారులు తెలిపారు. అయితే డ్రైవర్ స్పందించలేదని అన్నారు. వివరాల ప్రకారం… సిఆర్‌పిఎఫ్ 40వ బెటాలియన్‌తో మొఘల్ బ్రిడ్జీపై (నఖా) చెక్‌పాయింట్‌ను
ఏర్పాటు చేశామని కాశ్మీర్‌జోన్ పోలీసులు తెలిపారు. లైసెన్స్, ప్లేట్ లేకుండా వచ్చిన ఎస్‌యువి స్కార్పియో వాహనాన్ని ఆపాల్సిందిగా సూచించామని.. అయితే డ్రైవర్ పట్టించుకోకుండా కారు వేగాన్ని పెంచడాన్ని, దీంతో ఆత్మరక్షణ నిమిత్తం కాల్పులు జరిపారని ట్విటర్‌లో తెలిపారు. డ్రైవర్ పరారయ్యేందుకు యత్నించాడని, అందుకే కాల్పులు జరిపామని అన్నారు. మరణించిన వ్యక్తిని జమ్ములోని జాగర్ కొట్లి ప్రాంతానికి చెందిన యాసిర్ అలిగా గుర్తించినట్లు స్థానిక పత్రిక గ్రేటర్ కాశ్మీర్ తెలిపింది. కారు ఆపకుండా వెళ్లాడన్న కారణంతో ఆ వ్యక్తిని సిఆర్‌పిఎఫ్ నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిందని పేర్కొంది. ఈ చర్యను శ్రీనగర్ మేయర్ జునైద్ అజీమ్ మట్టు ఖండిరచారు. ఒక వ్యక్తిపై భద్రతా సిబ్బందిని వినియోగించడం అమానుషమైన, చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్‌పై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.