చెక్ పోస్టు వద్ద : నగదు స్వాధీనం

 

స్టేషన్ ఘన్‌పూర్: వరంగల్ జిల్లా రాఘవపుర్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  రూ. మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన వి.జే.రెడ్డి తన వాహనంలో తరలిస్తున్న రూ. 1.90 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ఎస్.ఎల్.రెడ్డి తన వాహనంలో లక్ష రూపాయలు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సరైన పత్రాలు లేని కారణంగా  వారి వద్ద నుంచి సదరు నగదును పోలీసులు తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో  పోలీసుల తనిఖీలు మరింత ముమ్మరం  చేశారు.