చెట్టును ఢీకొన్న కారు: పలువురికి గాయాలు

ఏటూరునాగరం,జూలై2(జ‌నం సాక్షి ): టాటా మ్యాజిక్‌ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సవిూపంలో జాతీయ రహదారిపై ఈఅ ప్రమాదం చోటుఏచేసుకుంది. వీరంతా వేములవాడ నుండి మంగపేటకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తోణ సహాయ చర్యలు చేపట్టారు.