చెట్లను మన ఆత్మీయ నేస్థలుగా చేరదీయాలి..
వృక్ష రక్షబంధన్ కార్యక్రమంలో గ్రీన్ కోర్ జిల్లా కో.ఆర్డినేటర్ గుండేటి యోగేశ్వర్.. ఆకట్టుకున్న పర్యావరణ మిత్ర రాఖీలు.
(తేదీ 29 ఆగస్టు 2023
సోమవారం మంచిర్యాల)
మానవునితో పాటు సకల ప్రాణకోటికి ఎంతగానో ఉపయోగపడే చెట్లను ఆత్మీయ నేస్తాలుగా భావించి చెరదీసి రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాలలో ఉన్న చెట్లకు పర్యావరణ మిత్ర పదార్థాలతో చేసిన రాఖీలు కట్టి ప్రేమను వ్యక్తం చేయాలని విద్యాశాఖ గ్రీన్ కోర్ జిల్లా కో.ఆర్డినేటర్ గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు.
చెట్లను నిర్దాక్షిణ్యంగా నరకరాదని హరితహారం లో నాటిన మొక్కలతో పాటు ఏపుగా పెరిగిన చెట్లను రక్షించాలని అప్పుడే పర్యావరణ సమతుల్యత పెరుగుతుందని అన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిషత్ (బాలుర )ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులు నుద్దేశించి మాట్లాడారు.
అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులచే “వృక్ష రక్ష బంధన్.” చేయించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు రాఖీ ఆకారంలో నిలుచని ప్రతిజ్ఞ చేయడం ఆక్ట్టుకుంది.
అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు రాఖీలు కట్టి చెట్లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
వివిధ పర్యావరణ మిత్ర పదార్థాలైన కాగితము, జనుము,బట్ట, ధాన్యము,వెదురు పుల్లలు,ధాన్యపు గింజలు తదితర పదార్థాలతో ..అందరూ చదవాలి అందరూ ఎదగాలి.. సేవ్ ట్రీస్..అంటూ సందేశాత్మకంగా చేసిన పలు విధాల రాఖీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. దుర్గయ్య, గ్రీన్ టీచర్ ఆరే శ్రీనివాస వర్మ, ఉపాధ్యాయులు ఏ.వేణు గోపాల్,ఆర్. రాజయ్య, డి. నాగరాజు, నీల్ కమల్ రంగరాణి, భాగ్యలక్ష్మి పర్యావరణ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.