చెరువు గట్లపై భారీగా మొక్కల పెంపకం

అటవీశాఖ అధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ నిర్ణయించింది. గతేడాది చేపట్టిన ప్రయత్నం ఫలించడంతో మరోమారు ఈ కార్యక్రమం అమలు చేయబోతున్నారు. ఈతచెట్లతో పాటు ఇతర చెట్లను నాటగం వల్ల చెరువు గట్లు కూడా పటిష్టంగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందులో ఈతవనాలకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎక్సైజ్‌, ఇరిగేషన్‌, ఫారెస్టుశాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడతాయని అన్నారు. మిషన్‌ కాకతీయద్వారా పునరుద్దరించిన చెరువు గట్లవిూద మొక్కలు నాటుతామని చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని, మొక్కలుకూడా సిద్దం చేశామని అన్నారు. అడవులు రక్షణకోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణలకు పాల్పడితే పీడీ యాక్టు ప్రకారం కేసులు నమేదుచేసి జైలుకు పంపుతామని జిల్లా అటవీశాఖ అధికారి హెచ్చరించారు. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఇప్పటివరకు అన్నిశాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేశారు. ఆందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రథమస్థానంలో ఉందని అన్నారు. అన్నిశాఖల వారి సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని అన్నారు. జిల్లాలో 300 బీట్లు ఉన్నాయని ఒక్కొక్కబీటులో వెయ్యి మొక్కలు నాటడం ధ్యేయంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. జిల్లాలో పోలీసులు అటవీశాఖ సహకారంతో 409 హెక్టార్లలో 5 లక్షల మొక్కలు నాటనున్నారని జిల్లా అటవీశాఖాధికారి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పోలీస్‌శాఖ కూడా చురుకుగా పాల్గొంటోంది. ఆయా ఠాణాల ఎస్సైల ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటనున్నారు. హారితహారంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విరివిగా మొక్కలను నాటాలని కోరారు. గ్రావిూణ ప్రాంతాల్లో జరిగే హరితహారంలో ఆయా ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు మొక్కల పెంపకం పట్ల స్థానికులను చైతన్యపరిచి చురుకైన పాత్ర పోషించాలని కోరారు. మొక్కల వలన ప్రయోజనాలను ప్రజలకు వివరించి ఇండ్లలో నాటే మొక్కల వలన లభాలను వారికి వివరించాలన్నారు. హరితహారం

కార్యక్రమంలో గ్రావిూణ ప్రాంత ఉపాధ్యాయుల కృషి ముఖ్యమైనది అని అన్నారు. సింగరేణి కార్మిక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏరియా జీఎం కేవీ రమణమూర్తి అన్నారు. సింగరేణి వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రతి సింగరేణి కార్మికుడు విధిగా ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.