చేతులెత్తేసిన టీమిండియా
– మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఓటమి
– ఫైనల్లోకి దూసుకెళ్లి ఇంగ్లాండ్
అంటిగ్వా, నవంబర్23(జనంసాక్షి) : మహిళల టీ20 ప్రపంచకప్ నుండి టీమిండియా ఇంటిదారి పట్టింది. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం అంటిగ్వాలో జరిగిన సెవిూఫైనల్ మ్యాచులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హర్మన్ సేన ఇంగ్లండ్ బౌలర్ల దాటికి 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాట్స్‌వుమెన్స్‌లో స్మృతి మంధాన (34), జెవిూమా రోడ్రిగ్స్(26)లవే టాప్ స్కోర్ సాధించారు. హార్డ్ హిట్టర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ (16), కృష్ణమూర్తి (2), బాటియా (11)లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఇక ఈ మ్యాచ్‌కు సీనియర్ క్రికెటర్, హైదరబాద్ స్టార్ మిథాలీ రాజ్ దూరం కావడం కూడా భారత్‌ను దెబ్బతీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. అవిూ జోన్స్ (53), నటాలీ సివర్ (51)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో ఇంగ్లండ్.. ఆసీస్‌ను ఢీకొట్టనుంది. గత ప్రపంచకప్
ఛాంపియన్ విండీస్ జట్టును ఓడించి ఆస్టేల్రియా ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అర్ధసెంచరీతో రాణించిన అవిూ జోన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఒక్కోసారి కీలక నిర్ణయాలు తప్పవు – కెప్టెన్ హర్మన్‌ప్రీత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన సెవిూఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభం నుంచి ప్రతి ఒక్కరూ తమ సత్తా మేరకు రాణించారన్నారు. అయితే కీలక మ్యాచ్‌లో ఓటమి తప్పలేదని ఆమె చెప్పుకొచ్చారు. సెవిూస్‌లో ఓపెనర్ మిథాలీరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం గురించి మాట్లాడుతూ..’జట్టు అవసరాల దృష్ట్యా కీలక నిర్ణయాలు తప్పవన్నారు. ఒక్కోసారి అవి విజయవంతమవుతాయి. కొన్నిసార్లు కాకపోవచ్చన్నారు. అలా అని ఒక్క మ్యాచ్‌ను ఆధారం చేసుకొని జట్టు ప్రదర్శనను అంచనా వేయలేం కదా అని తెలిపారు. పరిస్థితులను బట్టి మన ఆటలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఇంగ్లాండ్ బౌలర్లు పిచ్‌ను బాగా అర్థం చేసుకున్నారని, దానికనుగుణంగానే బంతులు విసిరారన్నారు. చివర్లో మేము బ్యాట్‌తో విఫలమైనా.. వారి ముందు కఠినమైన లక్ష్యాన్నే ఉంచగలిగామని, పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే అదేవిూ ఛేదించదగ్గ లక్ష్యమేవిూ కాదని కౌర్ తెలిపింది. దీనికి తగ్గట్టుగానే మ్యాచ్‌ను 18ఓవర్‌దాకా తీసుకెళ్లామని, కానీ ఒత్తిడి అధిగమించడంలో విఫలమై మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చిందని, ముందు దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని హర్మన్ పేర్కొంది.