చేపల అమ్మకాలతో మత్స్యకారుల ఆనందం

జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): ఎన్నో ఏళ్ల తరవాత తమకు వృత్తిపరంగా లాభం వచ్చిందనిగణపురం మండల ప్రాంతంలోని మత్స్యకారులు నాందం వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు నిండడం వల్ల్నే ఇది సాధ్యమయ్యిందన్నారు. అలాగే తమకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రబుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గణపురం కేంద్రంలోని గణపసముద్రం సరస్సులో చేపలు పట్టే కార్యక్రమం పండుగలా మారింది. రెండేళ్లుగా సరస్సులో చేపలు పట్టకపోవడంతో వందల టన్నుల చేప లు చెరువులో పెరిగాయి. గణపురం, బుద్దారం, గాంధీనగర్‌, మైలారం, నారాయగిరిపల్లి, దుం పిల్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 600 మంది మత్య్సకారులు ఆదివారం ఒకేసారి సరస్సులో చేపలను పట్టారు. సుమారు 20 టన్ను ల చేపలను

ఉదయంనుంచి సాయంత్రం వర కు మత్య్సకారులు పట్టడంతో సరస్సు ప్రాంగ ణం వివిధ రకాల చేపలతో నిండిపోయింది. ముఖ్యంగా బెంగాల్‌రవ్‌, బొచ్చె, వాలుగ, గ్యాస్‌ కట్‌, జాతిచేపలు కనిపించాయి. గత వారం రోజులుగా గణపసముద్రం సరస్సులో ఆదివా రం చేపలు పడతారని ప్రచారం కావడంతో పాటు ప్రస్తుతం కిలో ధర రూ.140 కాగా, కేవ లం రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయించా రు. దీంతో భూపాలపల్లి, రేగొండ, వెంకటాపూర్‌, ములుగు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జనం చేపలు కొనేందుకు ఎగబడ్డారు. సర స్సు ప్రాంగణంలో టెంట్‌ వేసి చేపలను విక్రయించారు. గత వంద సంవత్సరాలుగా ఎప్పుడూ సరస్సు ఎండిపోకపోవడంతో ఎన్నో రకాల దేశవాలి చేపలు ఉండటం వల్ల ఇక్కడి చేపలను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపిస్తారు.