*చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న గిరిజనులు సురక్షితం!

*సహాయక చర్యలు చేపట్టిన పోలీస్ రెవెన్యూశాఖ
*సంఘటన స్థలానికి కలెక్టర్ ,పోలీస్,రెవెన్యూ బృందం
_________________________
లింగంపేట్   జూలై (జనంసాక్షి)
 చేపల వేటకు వెల్లిన గిరిజనలు ముగ్గురు రాంపల్లి పెద్ద పాముల వాగులొ చిక్కుకొన్న వారు గురువారం సాయంత్రం సురక్షితంగా బయపడ్డారు.వివరాల్లోకి వెలితే
 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని రాంపల్లి కొనతాండ పక్కన ప్రవహిస్తున్న పాములాగు పెద్దవాగు కలిసే ప్రాంతంలో వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన దేవసోత్ చాంద్ రామ్ బాలు దుపియాలు వాగులో చిక్కుకున్న సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.లింగంపేట్ లొ గురువారం ఉదయం గంటసేపు కుంభవృష్ఠి వానపడింది.ఆ వర్షానికి పెద్దవాగు పాములాగులు ఉదృతంగా ప్రవహించడంతో చేపలు పడుతున్న గిరిజనులకు ఏమీ అర్థం కాక కేకలతో అర్థనాదాలు చేశారు.వాగులో ఉన్న చెట్ల పైకెక్కి ఎక్కి అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఉన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ జిత్ షి వి పాటిల్ ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు పోలీసు రెవెన్యూ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.వాగు ఉదృతంగా ప్రవహించడంతో వారి ప్రయత్నాలు ముమ్మరం చెసిన ప్రయోజనం లేఖపోయింది. సాయంత్రం వాగు తగ్గుముఖం పట్టడంతో వాళ్లంతట వాళ్లే వాగు దాటి బయటకు రావడంతో వారి కుటుంబీకులు పోలీస్ రెవెన్యూ సిబ్బంది.ఊపిరి పీల్చుకున్నారు.ఈ సహయక చర్యలల్లొ పాల్గొన్న తహసీల్దార్ మారుతి ఎస్ఐ శంకర్ గిర్దవర్ బాలయ్య పోలీస్ రెవెన్యూ సిబ్బందిన కలెక్టర్ అభినందిచారు.