చేయించుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్, మండల పరిధిలోని

చిదెళ్ళ గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి డి రామారావు నాయక్  పంటల నమోదు, పచ్చి రొట్ట పైరు మరియు పిఎం కిసాన్ ఈకే వేసి నమోదు ప్రక్రియ పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి  మాట్లాడుతూ పచ్చి రొట్టె పైరు లో వేయడం వలన భూమికి బలం చేకూరుతుందని తెలిపారు. Pm Kisan eKYC అందరూ తొందరగా చేసుకోవాలి దీనికి ఆఖరి తేదీ ఆగస్టు 31 వరకు చేసుకోవాలని తెలిపారు అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల నమోదు ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు  పంట నమోదు ను తొందరగా పూర్తి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి కృష్ణ సందీప్ పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి ఎంపిటిసి జులగంటి వెంకటరెడ్డి ఏఈవో మనోజ్ మాజీ సర్పంచ్ కొండమీద వెంకన్న గుడుపూరు పుల్లయ్య కొండమీది వెంకన్న రైతులు జూలకంటి రాజశేఖర్, మర్రిపెల్లి వెంకన్న,పందుల నాగరాజు,వెన్న గోపి రెడ్డి, జాల నాగరాజు,నూకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు