చైనాలో భారీ పేలుడు: 22మంది మృతి
బీజింగ్,నవంబర్28(జనంసాక్షి): ఈశాన్య చైనాలోని జాంగ్జికో నగరంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఎదుట జరిగిన పేలుడులో సుమారు 22మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అనేక వాహనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున హెబి షెన్గువా కెమికల్ ఇండిస్ట్రీ కో. లిమిటెడ్ నిర్వహిస్తున్న ప్లాంటు పక్కనే ఉన్న లోడింగ్ ఢాక్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు చైనాలోని అధికారిక వార్తా
పత్రిక ప్రకటించింది. ఈ ఘటనలో మరో 22మందికి గాయాలవగా, 38 ట్రక్కులు, 12 కార్లు ధ్వంసమైనట్లు జాంగ్జికో ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రాంతానికి వెళ్లకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.