జంక్షన్ల సర్వే నిర్వహణ

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు జంక్షన్ లను డెవలప్మెంట్ చేయడానికి గురువారం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంతోష్ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నుండి సర్వేయర్ కుమారస్వామి సర్వే నిర్వహించి జంక్షన్ కొలతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భార్గవ్, సర్వే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.