జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై సీబీఐ వాదనలను న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గతంలో తీర్పును పరిగణనలోకి తీసుకుని సీబీఐ విచారణ పూర్తి చేయాలని పేర్కొంది. జస్టిన్‌ సదాశివం, జస్టిన్‌ ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆర్థిక నేరాల వల్ల ప్రజాసంపద దుర్వినియోగమవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జగన్‌ కేసులో జరిగిన అక్రమాలన్నింటికి విజయసాయిరెడ్డి మూలమని, విజయసాయిరెడ్డి, జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ బయటకు వస్తే సాక్షులకు ఇబ్బందని సుప్రీంకోర్టు పేర్కొంది.