‘జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతాం’
హైదరాబాద్: తెలంగాణ వాదులపై దాడులు చేస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతామని తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ నేత శ్రీరంగారావు హ్చెరించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అడ్వొకేట్లు చేపట్టిన చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని జగ్గారెడ్డి చులకన చేస్తూ మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. సంగారెడ్డి వస్తే తమ అనుచరులు న్యాయవాదులపై దాడులు చేస్తారన విజయవాడ నుంచి తెలంగాణ న్యాయవాదులను హెచ్చరించడంపై శ్రీరంగారావు విరుచుకు పడ్డారు.
తెలంగాణ వాదంలో, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన జగ్గారెడ్డి తెలంగాణవాదాన్ని కాదనీ సీమాంధ్రుల తొత్తుగా మారడని విమర్శించారు. జగ్గారెడ్డికి దమ్ముంటే మళ్లీ తెలంగాణ ప్రజల ఓట్లతో గెవాలని సవాలు విసిరారు. ప్రజలెవరూ ఆయనకు ఓట్లు వేయరని శ్రీరంగారావు అన్నారు. ఇక జగ్గారెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.
ర్యాలీ నిర్వహించి తీరుతం : శ్రీరంగారావు
తమ ‘ చలో సంగారెడ్డి ‘ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినా ర్యాలీ చేసిన తీరుతమని అడ్వొకేట్ జేఏసీ నేతలు శ్రీరంగారావు, రామచందర్‌రావులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే ఇంటి ముట్టడీని, ధర్నాను విరమించబోమని ఆయన హెచ్చరించారు. గత ఐదు రోజుల క్రితమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినపుడే ఎస్సీ నుంచి ర్యాలీకి అనుమతి తీసుకున్నామని, మైకుకు కూడా అనుమతి పొందామని ఆయన తెలిపారు. తీరా ఇపుడు సీమాంథ్ర తొత్తు జగ్గారెడ్డి ఆదేశాల మేరకే ఎస్పీ తమ ర్యాలీని అడ్డుకుంటున్నారని శ్రీరంగారావు విమర్శించారు.