జనగామ డీఎస్పీ సురేందర్ ఇళ్లపై ఏసీబీ దాడులు
వరంగల్ జిల్లా జనగామ డీఎస్పీ సురేందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. హన్మకొండ, నర్సంపేట, జనగామ, హైదరాబాద్‌లో గల ఇళ్లలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ అ సోదాలు చేపట్టారు.దీంతోపాటుగా డీఎస్పీ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు తమ సోదాలను కొనసాగిస్తున్నారు.