జన్మదిన బహుమతిగా జాతీయ జెండా
జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్.
తాండూరు ఆగస్టు 14 (జనం సాక్షి)
జన్మదిన బహుమతిగా జాతీయ జెండాను బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ అందజేశారు. ఆదివారం పెద్దేముల్ మండల పరిధిలోని మంబాపూర్ గ్రామానికి చెందిన రిపోర్టర్ ప్రసాద్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్. పెద్దేముల్ మండల్ బిజెపి పార్టీ అధ్యక్షులు సందీప్ కుమార్ తో కలిసి శాలువాతో సత్కరించి జాతీయ జెండాను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు అభిలాష్. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు