జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

దండేపల్లి. జనం సాక్షి.18 గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వార్త కవరేజ్ కోసం జగిత్యాల జిల్లా కు చెందినNTV రిపోర్టర్ జమీర్ వరదల్లో చిక్కుకొని మృతి చెందాడు మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సోమవారం దండేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది అనంతరం జమీర్ చిత్ర పటాని కి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బండి రవి మాట్లాడుతూ జమీర్ చాలా నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నారు ప్రతి విలేఖరి కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో దండేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు అల్లంల కుమారస్వామి వెంకటేష్ ప్రసాద్ ఎడ్ల రాజన్న శ్రీనివాస్ బూసిరాజు రాజన్న వెంకటపతి బుర్ర శ్రీనివాస్ ఎలగందుల సత్యం .మెంగని శ్రీనివాస్ షరీఫ్ సుభాష్ తొట్ల మల్లేష

తాళ్ల కుమారస్వామి గడ్డం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు