జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని వినతి .

ఫోటో రైటప్: ఆర్డీవో కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ప్రెస్ క్లబ్ నాయకులు.
బెల్లంపల్లి, ఆగస్టు26, (జనంసాక్షి)

బెల్లంపల్లి పట్టణంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జర్నలిస్ట్ నాయకులు బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా బెల్లంపల్లి జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతు విభజన బిల్లులో ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతు సొంత ఇల్లు లేని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అద్దె ఇళ్లలో తమ కుటుంబాలతో జీవిస్తూ అనేక అవస్థలు పడుతున్నామని ఆర్డీవోకు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆర్డీవో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులపై జిల్లా కలెక్టర్ కు సమాచారం అందజేస్తానని ఆమె పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జర్నలిస్టులు, స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.