జహీరాబాద్‌లో యువతిపై అత్యాచారం
మెదక్: జహీరాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో నిన్న రాత్రి ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు విని రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రక్తస్రావంతో పడివున్న ఆమెను స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారమందించారు. ఈ ఘటనకు సంబందించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.