జాతీయస్థాయి కరాటే పోటీలో..
ఊరుకొండ మండల విద్యార్థుల ప్రతిభ..
ఊరుకొండ, సెప్టెంబర్ 11 (జనం సాక్షి):
జాతీయస్థాయి కరాటే పోటీలో
ఊరుకొండ మండలానికి చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించారని కరాటే మాస్టర్లు కిరణ్ నాయక్, వినోద్ లు తెలిపారు. ఆదివారం కాకినాడ సామర్లకోట లో విక్టరీ షోటోఖాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించినటు వంటి జాతీయ స్థాయి కరాటే పోటీలలో ఊరుకొండ మండల కేంద్రానికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు సబ్ జూనియర్ కటాస్ విభాగంలో లహరి(ఉర్కొండ) బంగారు పతకం, ఫైట్ విభాగంలో రామ్ చరణ్(ముచ్చర్లపల్లి) బంగారు పతకం కైవసం చేసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులు గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున్ గౌడ్ గారు, తెలంగాణ షీ టీం లక్ష్మీ మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్స్ మెడల్స్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులను నాగర్ కర్నూల్ జిల్లా కరాటే అండ్ కబడ్డి అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాస్టర్ కిరణ్ నాయక్, వినోద్ నాయక్ లు అభినందించారు.