జాతీయ ఆరోగ్యసూచీలో తెలంగాణ టాప్..
` కేంద్ర గణాంకాల్లో వెల్లడి
` మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం
` సత్పలితాల నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలు
` ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం
` ఆరోగ్య తెలంగాణగా ఆవిర్భావం
` ప్రభుత్వ చర్యలతో మారిన ఆస్పత్రుల తీరు
` సౌకర్యాల కల్పనతో పాటు సిబ్బంది భర్తీ
` 102 రిఫరల్ ట్రాన్స్పోర్ట్ వసతితో 41 లక్షల మంది గర్భిణులకు రవాణా సదుపాయం
` ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల శస్త్రచికిత్సలు..లబ్ధిపొందిన 13 లక్షల మంది పేషెంట్స్
` రూ.92 కోట్లతో భోధన, జిల్లా పీహెచ్సీ/సీహెచ్‌సీ ఆసుపత్రులలో విద్యుత్ సేఫ్టీ పనులు
హైదరాబాద్(జనంసాక్షి): ‘‘ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖాన’’కు అన్నట్లు వుండే ప్రభుత్వ ఆసుపత్రులు తీరు నేడు పూర్తిగా మారాయి.రాష్ట్రంలో ఆస్పత్రులు నేడు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరిగింది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణాగా ఆవిర్భావం చెందుతున్నది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన బహుముఖ చర్యల కారణంగా జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానానికి చేరుకుందని ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఆరోగ్య సబ్ సెంటర్ల నుంచి ప్రాథమిక, ఏరియా, జిల్లా, బోధన, రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం పటిష్టపరిచింది. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు, టెస్ట్ లను విస్తృతం చేసేందుకు వ్యవస్థాపరమైన వసతులను అభివృద్ధి చేసింది. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పౌరుల ఆరోగ్య స్థితి మెరుగుపడిరది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ముఖ్య ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి కనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడక ముందు 92గా ఉన్న మాతృ మరణాల రేటు నేడు 56కు తగ్గింది. శిశు మరణాల రేటు 39 నుంచి 21కి తగ్గింది. 5 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న పిల్లల మరణాల రేటు 41 నుంచి 30కు, నవజాత శిశు మరణాల రేటు 25 నుంచి 17కి తగ్గింది. నీతి ఆయోగ్ వెల్లడిరచిన నివేదిక ప్రకారం ఆరోగ్య సూచికల్లో దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. కేసీఆర్ కిట్ ద్వారా 2017 నుంచి ఇప్పటివరకు 13,29,951 మంది లబ్దిపొందారు. రూ.1,176 కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. 102 రిఫరల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 41 లక్షల మంది గర్భిణులు రవాణా సదుపాయం పొందారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పుట్టి, ఎదిగేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో 99శాతం లక్ష్యాన్ని సాధించింది. 35 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. లేబర్ రూమ్‌ల సవిూపంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ల ద్వారా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు సరయిన ప్రత్యేక సంరక్షణ సేవలు సకాలంలో అందుబాటులోకి వచ్చాయి. పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి జీహెచ్ఎంసీ ప్రాంతంలో 259 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. బస్తీ దవాఖానాల్లో 195 రకాల మందులు, 57 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.ఉచిత డయాగ్నోస్టిక్ కేంద్రాలు ద్వారా హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద రక్త పరీక్షలు, ఈసీజీ అండ్ ఎక్స్`రే, యూఎస్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రస్తుతం 20 జిల్లాల్లో ఈ టెస్ట్ లాబ్స్ ఉన్నాయి. మరో 13 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి నెలా దాదాపు 4 లక్షల శాంపిల్స్‌ను ఈ టెస్ట్ లాబ్స్ లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం హబ్‌లు పాథాలజీ, రేడియాలజీ, వైరాలజీ సేవలను కూడా అందిస్తున్నాయి. వీటితో పాటు సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌ను ప్రభుత్వం విస్తృత పరిచింది. సెకండరీ కేర్‌లో 10,170 పడకలతో 175 ఆసుపత్రులు సెకండరీ హెల్త్ కేర్ సేవలను అందిస్తున్నది. తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్యవిద్యను ప్రజలకు చేరువచేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేల జిల్లాలకు వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో అదనపు వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది.18 మే 2021న ఏబీ`పీఎంజేఏవై స్కీమ్‌తో ఆరోగ్యశ్రీని ప్రభుత్వం అనుసంధానించింది. తద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 25 లక్షలకుపైగా శస్త్రచికిత్సలు జరిగాయి. తద్వారా 13 లక్షలకుపైగా పేషెంట్స్ లబ్దిపొందారు. రాష్ట్రంలో 57 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు, 17 రక్త నిల్వ కేంద్రాలు ఉచితంగా సేవలు అందిస్తున్నాయి. 27 బ్లడ్ బ్యాంకుల్లో కాంపోనెంట్ సెపరేటర్లు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు కొత్త ’ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ను ప్రవేశపెట్టింది. విధానంలో భాగంగా డైట్ ఛార్జీలను రెట్టింపు చేసి కొత్త డైట్ మెనూను తీసుకువచ్చింది. కొత్త ఔషధ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. రూ.61కోట్ల అంచనా వ్యయంతో 29 బోధనాసుపత్రులు, 20 జిల్లా ఆసుపత్రులు, 30 ఆసుపత్రులు/సీహెచ్‌సీల్లో ఎలక్టిక్రల్ సేప్టీ పనులు మంజూరు చేయగా.. పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.61 కోట్లతో 20 ఆసుపత్రుల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మంజూరు అయ్యాయి. రూ.31 కోట్ల అంచనా వ్యయంతో 153 ఇతర ఆసుపత్రుల్లో ఫైర్ సేప్టీ పనులు మంజూరయ్యాయి. 61 ఆసుపత్రుల్లో మార్చురీల మరమ్మత్తు, పునరుద్ధరణ అండ్ అప్‌గ్రేడేషన్ పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 12,755 ఖాళీలను భర్తీ చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌కు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చిందని ఆరోగ్యశాఖ వివరించింది.