జాతీయ జెండాను అవమాన పరిచిన కలెక్టర్ పై చర్యలు చేపట్టాలి….రావుల రాంనాథ్
నిర్మల్ బ్యూరో, ఆగస్టు22,,.జనంసాక్షి,,, జిల్లా కలెక్టర్ నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామంలో జాతీయగీతాలాపన చేస్తున్న సందర్భంలో సెల్యూట్ చేయకుండా జాతీయ జెండాను అగౌరవ పరుస్తూ జాతిని మువ్వెన్నెల జెండాను అవమాన పరిచిన జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖ్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాధ్. డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అయి ఉండి దేశం మొత్తం మువెనల జెండాను గౌరవిస్తూ ఘనంగా ఉత్సవాలు జరుపుతుంటే కలెక్టర్ సెల్యూట్ చేయకుండా అలాగే నిలబడి అవమానం చేస్తు దేశ వ్యతిరేకిగా ఉంటుూ ఒక్క వర్గానికి కొమ్ముకాస్తూ దేశ ప్రతిష్ఠను మంటగలపటము జరుగుతుంది రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇదేవిధంగా చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం వల్లే ఇదంతా జరుగుతుంది కలెక్టర్ జాతి వ్యతిరేకిగా వ్యవహరించడంతో అతన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని డిస్మిస్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు మెడిసెమ రాజు సామ రాజేశ్వరరెడి బిజెవైయ౦ జిల్లా అధ్యక్షుడు ఒడిశల అర్జున్ రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్ కుమరి వెంకటేష్ సోషల మీడియాసెల్ కన్వీనర్ నరేష్ లు పాలొనారు