జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటాలి.
నెరడిగొండఆగస్టు9(జనంసాక్షి)ఆజా దీ కా అమృత్ మహోత్సవంలో బాగంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం రోజున మండలంలోని ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్లు పంచాయతీ పాలకవర్గ సిబ్బందిలు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో అనిల్ జాధవ్ పాల్గొని జాతీయ జెండాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని,దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భావిష్వత్తు తరాలకు అందించాలని కోరారు.జెండా పంపిణీ కార్యక్రమంలో అనిల్ జాధవ్ తోపాటు మండల పీఏసీ ఎస్ చైర్మన్ సాబ్లే కిషోర్ సర్పంచ్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.