జాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన సర్పంచులకు,

 సెక్రటరీలకు ఘన సన్మానంజాతీయ పంచాయతీ అవార్డులు సాధించిన సర్పంచులకు, సెక్రటరీలకు ఘన సన్మానం
జనంసాక్షి , కమాన్ పూర్ :  జాతీయ పంచాయితీ అవార్డులలో కమాన్ పూర్ మండలం ముందు వరుసలో నిలిచింది. మండలంలో ఏడు గ్రామ పంచాయతీలకు గాను ఆరు గ్రామపంచాయతీలు పలు క్యాటగిరీల్లో అవార్డులను దర్శించుకున్నాయి . 9 విభాగాల్లో కు గాను తొమ్మిదింటి అవార్డులు దక్కించుకొని జూలపల్లి జిపి ముందు వరసలో నిలిచింది. సిద్దిపల్లె జిపి ఏడు విభాగాల్లో అవార్డులు దక్కించుకొని రెండో స్థానంలో నిలువగా, ఆరు విభాగాల్లో చోటు దక్కించుకొని రొంపికుంట జిపి మూడు స్థానంలో నిలిచింది. వీటితో పాటు నాగారం కమాన్పూర్ పెన్సికల్ పేట జీపీలు ఒకటి రెండు కేటగిరీలో చోటు దక్కించుకున్నాయి. శుక్రవారం  కమాన్ పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి అధ్యక్షతన కమాన్ పూర్ మండలంలోని జాతీయ అవార్డులు గెలుచుకున్న పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులను  ఈ సందర్భంగా ప్రశంస పత్రాలు, షీల్డ్లు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ దాసరి రాజలింగు,  సింగిల్ విండో చైర్మన్ ఇనుగంటి భాస్కరరావు,  ఎంపీడీవో విజయ్ కుమార్, తాసిల్దార్ దత్తు ప్రసాద్ , ఎంపీఓ శేషయ్య సూరి,  వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్,  ఏఎంసీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, ఐకెపి ఎపిఎం శైలజ శాంతి,  ఈజీఎస్ ఏపీవో మల్లేశ్వరి, పిఆర్ ఏఈ రాధ,  పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.