జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..

సిద్దిపేట 30, జూలై ( జనం సాక్షి )
జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కోర్టు కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ డిస్టిక్ సెషన్స్ జడ్జి టి. రఘురాం ప్రజలకు సూచించారు.ఆగస్టు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం సిద్దిపేట పట్టణంలోని జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జెడ్జి మరియు మండల న్యాయ సేవసమితి చైర్మన్ టి.రఘురాం ప్రెస్ మీట్ నిర్వహించి జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత కక్షిదారులు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, మోటార్ వెహికల్, విద్యుత్ కేసులు ఇతరత్రా  అన్ని రకాల కేసుల శాశ్విత, సత్వర పరిష్కారం కోసం ఆగస్టు 13వ తేదీ నాడు జిల్లాలోని సిద్దిపేట, ఉస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక కోర్టులలో మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ కేసులను పరిష్కరించడం జరుగుతుందని, ఈ లోక్అదాలత్ లలో పరిష్కరించ బడే కేసులు అప్పీల్ కు వెళ్లే అవకాశం కూడా ఉండదు కాబట్టి కక్షిదారులు కేసుల నిమిత్తం మళ్లీ మళ్లీ కోర్టుల చుట్టూ తిరగకుండా శాశ్వతంగా పరిష్కరించబడతాయి. కావున ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలో సుమారు 20 వేల కేసులు పెండింగ్లో ఉండగా ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడానికి 9600 కేసులను గుర్తించడం జరిగింది వాటిలో 130 కేసుల కక్షిదారులకు నోటీసులు పంపటం జరిగిందని మిగతా వారికి ఆగస్టు 13వ తేదీ లోపల నోటీసులు జారీ చేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతాము కాబట్టి సంబంధిత కక్షిదారులు ఆగస్టు 13వ తేదీన సంబంధిత కోర్టుల్లో హాజరై కేసులను పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఈ ప్రెస్ మీట్ లో పిలుపునిచ్చారు.