జాతీయ లోక్ అదాలత్ లో 67 కేసులు పరిష్కారం.

న్యాయమూర్తి టి. స్వప్న.
తాండూరు అగస్టు 13(జనంసాక్షి) తాండూరు
పట్టణన్యాయ స్థానంలో న్యాయ మూర్తి టి. స్వప్న (జూనియర్ సివిల్ జడ్జ్ లీగల్ సర్వీస్ ఆధారిటి చైర్మన్ అధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు.ఇందులో పరిష్కరించబడిన కేసుల పూర్తి వివరాలు.. సిసి.16,ఎంసి2,సివిల్12,ఈపి1,సిసి (అడ్మినిస్ట్ )27, ఎక్సైజ్9 ,అదేవిధంగా ఎస్.టి.సి 403 కేసులను పరిష్కరించడం జరిగిందని న్యాయ మూర్తి టి.స్వప్న తెలిపారు.ఈ సందర్భంగా న్యాయమూర్తి టి. స్వప్న మాట్లాడుతూ కక్ష దారులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లేనిపోని గొడవలు చేసి తమ జీవితాలను అంధకారంలోకి తీసుకెళ్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, కార్యదర్శి ఎన్. రవీందరెడ్డి, సీనియర్ న్యాయవాదులు. శ్రీనివాసరెడ్డి, విజయకుమార్ , బాలి శివకుమార్, బి.భవనప్పు, మనోహర్ రావు, పి.శ్రీనివాస్ లోక్ అదాలత్ మెంబర్ .రాంరెడ్డి, న్యాయవాదులు, కే. గోపాల్, విశ్వనాథ్, కే.శ్రీనివాస్, రాజరెడ్డి, కె.రవికుమార్, బి. పాశం రవికుమార్, మహిళ న్యాయవాదులు సోషియా, రజిత, వాణిశ్రీ, అరుణ. మరియు కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సిబ్బంది, పోలిసులు కక్షిదారులు పాల్గొన్నారు.