జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

ఆర్డీవో రోహిత్ సింగ్
మిర్యాలగూడ. జనం సాక్షి
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 16 17 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ అధికారులను కోరారు. సోమవారం ఉత్సవాల నిర్వహణపై ఎంపీడీవో సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ గా చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
అందరు చిన్నారులు జాతీయ పతాకం చేబూనాలని,
ర్యాలీ మూడు భాగాలు గా విభజించి ఒకే చోటుకు చేరుకునే విధంగా విద్యా సంస్థలు ప్రతినిధులు, స్థానిక అధికారులు, పోలీసులు సమన్వయంగా ముందుకు సాగాలన్నారు.
ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనే విషయం లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో కూడా చర్చించారు.
46 గ్రామ పంచాయతీల పరిధిలో ఒక్కో గ్రామపంచాయతీ నుండి
100 మంది విద్యార్థులు హాజరయ్యేలా చూడాలన్నారు.
మొత్తం 7 గురుకుల పాఠశాలలలోని
952 విద్యార్థినీ, విద్యార్థులు
పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.
7 తరగతి పైన చదివే వారినే పాల్గొనేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎం ఈ ఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ
మండల వ్యాప్తంగా 450 విద్యార్థులు పాల్గొంటారని,
గ్రామ సర్పంచ్ లు కూడా
సహకరించాలని కోరారు.
ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి మాట్లాడుతూ
కేజీవీబీ పాఠశాలల విద్యార్థినీ. విద్యార్థులను ఆయా పాఠశాలల టీచర్స్ తీసుకురావాలి
వాళ్లదే భాద్యత అని అదే విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులను పంపే భాద్యత కూడా సర్పంచ్ లదే అని అన్నారు.
ర్యాలీ ని మిర్యాలగూడ పట్టణ,రూరల్ పోలీస్ భాద్యతలు గా డి ఎస్ పి. కే వెంకటేశ్వర రావు అన్నారు.
ఉదయం 11 గంటలకు ఎల్ ఐ సీ కార్యాలయం దగ్గర నుండి నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని,
అవంతిపురం కేజీవీబీ పిల్లలు ఈడులగూడ నుండి నడక దారిలో ప్రవేశం
మూడు ప్రాంతాల్లో
పోలీస్ పర్యవేక్షణ
పిల్లలను తీసుకురావడం,
పంపించడం వాళ్లదే బాధ్యత గా ఆర్ డి ఓ సూచించారు.ర్యాలీ లో పాల్గొనే విద్యార్థులకు త్రాగునీరు, భోజన సౌకర్యాలను మున్సిపల్ అధికారులు చేపట్టాలని ఆర్డీవో కోరారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్. విద్యాశాఖ అధికారులు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం, పోలీసు అధికారులు పాల్గొన్నారు.