జాతీయ స్థాయిలో శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

జాతీయ స్థాయిలో శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థుల ప్రతిభహుజురాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ (ఐ.ఎన్.టి.ఎస్.ఓ) పరీక్షలో హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య కరికులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచ్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు 152 మంది ఒలంపియాడ్ పరీక్షలు రాయగా 106 మంది జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో రాగి వర్షిత్, మూడో స్థానంలో తోట స్ఫూర్తి, నాలుగవ స్థానంలో రేపాల రిత్విక్ వర్ధన్, ఐదవ స్థానంలో కందుకూరి రుద్రాక్షి , తోట అద్వైత్ లు ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్స్ బహుమతులు సాధించారు. వీరితోపాటు 101 మంది విద్యార్థులు జాతీయస్థాయిలో కన్సోలేషన్ బహుమతులు, గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ ఒలింపియాడ్ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, డిజీఎం లక్ష్మణ్ రావు, ఆర్ఐ రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, డీన్ మంద శ్రీనివాస్, ప్రైమరీ ఇంచార్జ్ సౌజన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.