జాతీయ స్ఫూర్తి ప్రతి ఒకరిలో నింపాలి.
తాండూరులో వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకుందాం…
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అగస్టు (జనంసాక్షి) వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరి లో నింపాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుదవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్ని మండలాల సంబందించిన ముఖ్య నాయకుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 14న వికారాబాద్ లో సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని మరియు టీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కె సి ఆర్ ప్రారంభిస్తారని అనంతరం భారీ భహిరంగ సభ ఉంటుందని చెప్పారు. తాండూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భహిరంగ సభ ని విజయవంతం చేయాలని కోరారు.10లక్షల పెన్షన్లు మంజూరు చేసినందుకు సీఎం కె సి ఆర్ కు ధన్యవాదములు తెలిపారు. గ్రామాలలో అర్హులైన వారికి పెన్షన్లు కోసం ధరకాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ పై సమీక్ష…..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా సంబరాలు జరిపేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కేశవరావు నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీ వేసి 15 రోజుల పాటు ఉత్సవాలు జరిపేలా కార్యాచరణ ప్రకటించారని అన్నారు.ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని,మన దేశ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటలన్నారు.మన రాష్ట్రంలో కోటి 20 లక్షలు జెండాలు మన చేనేత బిడ్డలు తయారుచేసారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటి ముందు జెండాలు ఎగురవేసి జాతీయ స్ఫూర్తి చాటాలన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా రేపు జరిగే ఫ్రీడమ్ రన్ ను ఘనంగ నిర్వహించాలని, 12 న జరిగే జాతీయ రక్ష బంధన్ ఒకే దగ్గర 75 మంది చొప్పున స్వయం సహాయక సంఘాల మహిళలు కలిసి ఘనంగాజరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఎంతో గొప్పగా జాతీయ స్ఫూర్తి ప్రతి ఒకరితో నింపేల తీసిన గాంధీజీ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. అని అన్నారు.
ప్రతి ఒక్కరి మొహంలో చిరు నవ్వు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని 200 ఉన్న పెన్షన్లు 2 వేల వరకు పెంచారని,కళ్యాణ లక్ష్మి ,షాది ముబారాక్,రైతు బంధు,రైతు భీమా లాంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారు .మానవతా దృక్పథంతో చాలా పథకాలు వచ్చాయని,తెలంగాణా రాకముందు,వచ్చిన తర్వాత పరిస్థితులు ప్రతి ఒక్కరు గమనించాలని అన్నారు.ఒకే సమయంలో తెలంగాణ అంతా ఈ నెల 16 న జాతీయ గీతలాపన కార్యక్రమంలో అందరూ ఎక్కడి వారు అక్కడే పాల్గొనాలని,గ్రామాల్లో ప్రజలు ఒకే దగ్గర చేరి సామూహికంగా జాతీయ గీతలాపన చేయాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు.సమయాన్ని త్వరలో ప్రకటిస్తారని తెలిపారు.బాణాసంచాలు పేలుస్తూ, బెలూన్లు ఎగురవేస్తూ,75 ఏళ్ల సంబరాలు కనివీని ఎరుగని రీతిలో ఘనంగా ఒక పండుగలాగా నిర్వహిద్దామని,ఇందులో విద్యార్థులు,యువజన సంఘాలు,మహిళ సంఘాలతో పాటు ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.