జాలర్ల వలలో చిక్కిన వింత చేప
శ్రీకాకుళం, మార్చి 29 : శ్రీకాకుళం జిల్లా జాలర్ల వలలో ఓ వింత చేప చిక్కింది. నందిగామ మండలం గ్రామ చెరువులో చేప ముఖంపై చిన్నపాటి ముళ్లతో పద్మం ఆకారం చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. అది భగవంతుని స్వరూపంగా భావించి… పల్లెంలో పెట్టి పూజలు చేస్తున్నారు. రెండు కేజీల బరువు ఉన్న ఈ వింత చేపను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.