జియో రైల్‌ యాప్‌ ప్రారంభం

రైలు టిక్కెట్ల బుకింగ్‌ మరింత సులువు

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): జియో ఫోన్‌ వినియోగదారులకు రలై/-వే సేవలను కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వినయోగదారుకలు మరింత చేరువయ్యేందుకు టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో మరో సరికొత్త అప్లికేషన్‌తో ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైలు టిక్కెట్‌లను బుక్‌ చేసుకునేందుకు ఉపయోగిస్తున్న ఐఆర్‌సీటీసీ యాప్‌ లాగే సేవలందించే ‘జియో రైల్‌’ యాప్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఈ- వాలెట్‌లను ఉపయోగించి రైలు టికెట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. రైళ్ల రాకపోకలకు సంబంధించిన సమాచారం, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, సీట్ల లభ్యత, టిక్కెట్‌ల రద్దు వంటి సేవలను ఈ యాప్‌లో పొందుపరిచారు. అంతేకాకుండా చివరి నిమిషాల్లో ప్రయాణం కోసం బుక్‌ చేసుకునే తత్కాల్‌ టికెట్‌లకు కూడా ఈ యాప్‌ను ఉపయోగించి బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారులకు ఐఆర్‌సీటీసీ ఖాతా లేకపోయిన్పటికీ ‘జియో రైల్‌’ యాప్‌లో కొత్త ఖాతా సృష్టించుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ ‘జియో యాప్‌ స్టోర్‌’లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.