జియో సేల్స్ మళ్లీ షురూ.. కొందరికి మాత్రమే
జియో ఫోన్ అమ్మకాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి మాత్రమే ఫోన్లు దక్కనున్నాయి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపింది. వాటిల్లోని లింక్ పై క్లిక్ చేస్తే కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను స్థానిక జియో అవుట్ లెట్ లలో చూపిస్తే ఫోన్ ఇస్తారు. కేవలం రూ.500 చెల్లించి ఫోన్ అందుకోవచ్చు. మొదటి దశలో 60 లక్షల మొబైల్స్ అమ్మకాలు జరిపిన రిలయన్స్ జియో.. రెండో దశలో 10 మిలియన్ల ఫోన్లు అమ్మాలని చూస్తోంది.
గతంలో రూ.1500 డిపాజిట్… 36 నెలల తర్వాత ఫోన్‌ను తిరిగి వెనక్కి ఇవ్వడం ద్వారా ఆ డబ్బును పొందవచ్చునని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్ట్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొన్ని రోజులకే భారీగా అమ్మకాలు జరుపుకున్నాయి ఈ ఫోన్లు. దీంతో అమ్మకాలు నిలిపేసింది.
జియో ఫోన్ ప్రత్యేకతలు:
వాయిస్ అసిస్టెంట్ లాంటి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు జియోఫోన్ ఆఫర్ చేస్తుంది. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, సింగిల్ సిమ్ ఫోన్, మైక్రోఎస్డీ కార్డు స్లాటు, ఎఫ్‌ఎం రేడియో, 2ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 0.3ఎంపీ ఫ్రంట్ కెమెరా, 512ఎంబీ ర్యామ్ ఆన్‌బోర్డు, 4జీబీ స్టోరేజ్, 128జీబీ విస్తరణ మెమరీ, 2000ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు