జిల్లా కేంద్రంలో అవతరణోత్సవాలు

విద్యుద్దీపాలతో కూడళ్ల అలంకరణ

జనగామ,జ‌నం సాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను రెండోయేడు ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. జిల్లా పునర్విభజన తర్వాత వస్తున్న రాష్ట్ర అవతరణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులంతా శ్రమించారు. ఆయా శాఖల ప్రగతి నివేదికల తయారీ, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం, రుణాలు పంపిణీ చేయనున్నారు. ఉదయం 7.30 నుంచి 8గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేపడతారు. ఉదయం 8.30 నుంచి 9గంటల వరకు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్య అతిథిచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుంది. ఆ తరవాత ఛాయచిత్ర ప్రదర్శన ప్రారంభోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. అదేరోజు సాయంత్రం 7 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు.