జిల్లా పోలీస్ కార్యాలయం లోని విభాగాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ N. కోటిరెడ్డి ఐపిఎస్…
వికారాబాద్ జనం సాక్షి జూలై 6:
ఈ రోజు జిల్లా ఎస్‌పి పోలీసు కార్యాలయంలో అన్నీ విభాగాలను ఆకస్మికంగా తనికీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా Reception, Inward/Outward, SB, DCRB, IT Core Team, Clues Team, Command and control, communication, DPO Sections మరియు ఇతర అన్ని విభాగాలని తనిఖీ చేసి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జారిగింది.
ప్రతి విభాగంలో ఉద్యోగుల యొక్క సమయపాలన, ఉద్యోగ నిబద్దతను గురించి విభాగ అధిపతిని అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఉద్యోగికి సమయపాలన,క్రమశిక్షణ అవసరమని మనది క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ కావున ఎవరు చెడు పేరు తెచ్చుకునే విధంగా ప్రవర్తించొద్దని సూచించారు.
పోలీసు శాకలో ప్రవేశపెట్టిన 5S విధానాన్ని అన్నీ విభాగాలలో పరిశీలించి, 5S విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అవసరమైన మార్పులు సూచించారు.
ప్రతి విభాగంలో files అండ్ Records చెక్ చెయ్యడం జరిగింది.ఏమైన పెండింగ్ వున్నాయా లేదా అని, వుంటే ఎందుకు వున్నాయో అడిగి తెలుసుకొని వాటిని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు.పని విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హల్లో విభాగాధిపతులతో విడిగా సమావేశమై, వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించాలని సూచిస్తూ, వారి ఆఫీసులలో మౌలికసదుపాయల గురించి అడిగి తెలుసుకొని, ఏమైనా సమస్యలు ఉంటే వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని తెలిపారు.