జిల్లా విద్యా శాఖధికారిపై సర్పంచుల ఆగ్రహం

సర్వసభ్య సమావేశాన్ని వాకౌట్ చేసిన వైనం
వెనువెంటనే ఫలించిన సర్పంచుల ప్రయత్నం
(జనం సాక్షి)మండలంలోని ఆయా గ్రామాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆకారణంగా డిప్యూటేషన్ పై వేరే మండలాలకు పంపడంతో మండల ప్రజాప్రతినిధులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది శుక్రవారం రోజున జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం వాకౌట్ చేసి కార్యాలయం ముందు బైఠాయించడంతో మండల విద్యాధికారి చంద్రకాంత్ ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారి కి ఫోన్లో వివరించగా తిరిగి యధా స్థానానికి పంపిస్తానని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించి సర్వసభ్య సమావేశంలోకి అడుగు పెట్టారు ఇదివరకు మండలంలోని ముఖ్యంగా గడ్చంద ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిని మామడ మండలానికి కేటాయించడంతో తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతుందని అందుకే నిరసన కార్యక్రమాన్ని చేపట్టామనిగడ్చంద  సర్పంచ్ వెంకట్రావు జనం సాక్షితో తెలిపారు ఏది ఏమైనా డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి మండలానికి ఉపాధ్యాయులను కేటాయించడం హర్షించదగ్గ విషయమని సర్పంచులు తెలిపారు జిల్లా, మండల విద్యాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు భుజంగరావు, ముత్త గౌడ్, ఎల్లన్న, దిగంబర్, నరసింగరావు