జుక్కల్ లో ఘనంగా భగవాన్ బలరాం జయంతి

15మంది రైతులకు సన్మానం
జుక్కల్ ,సెప్టెంబర్ 3,జనంసాక్షి ,
జుక్కల్ లో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో భగవాన్ బలరాం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.భగవాన్ బలరాం చిత్రపటానికి పూజలు చేసి పూలదండలు వేశారు. ఈ సందర్బంగా భారతీయ కిసాన్ సంఘ్ జుక్కల్ మండల అధ్యక్షులు నాగల్ గిద్దె శ్రీనివాస్ భూమిని నమ్ముకుని నిత్యం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే 15మంది రైతులకు కండువా కప్పి సన్మానించి గౌరవించారు. అనంతరం ఆయన మా
ట్లాడుతు భగవాన్ బలరాం నాగలి ధరించి రైతులకు ప్రతీకగా నిలిచారని అన్నారు. అందుకే ఆ భగవంతుడి జయంతి రోజును రైతు దినోత్సవంగా జరుపు కుంటున్నామని తెలిపారు.పార్టీలు వేరైనా రైతులమంతా ఒక్కటిగా ఉందామని సమస్యలపై సమిష్టిగా పోరాడుదామని అన్నారు.ప్రభుత్వం రైతులకందించే సంక్షేమపథకాలు సద్వినియోగం అయ్యేలా చూద్దామని తెలిపారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సలహాలు పాటిస్తు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుందామని తెలిపారు. ప్రజలందరికి అన్నం పెట్టే రైతన్న అంటే సమాజంలో ప్రత్యేక గుర్తింపు రావలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ అధ్యక్షులు లక్షెట్టి శంకర్, ఉపాధ్యక్షులు చాకలి కృష్ణ, స్థానిక సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దె శివానంద్,
ఆ సంఘం నాయకులు ప్రకాష్ కౌరే, విజయ్ పటేల్, షర్పోద్దిన్, జ్ఞానేశ్వర్, శ్యామ పవర్, విటుగొండ ఉమాకాంత్, నంగేవార్ భూమయ్య, బసవరాజు, గోరఖ్ నా థ్, రాజప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు.