జూనియర్ కాలేజీ ల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
బోథ్ (జనంసాక్షి) ప్రభుత్వ జూనియర్ కాలేజీ లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని కోరాతూ టిజివిపి ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు బుధవారం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ మండల కన్వీనర్ నల్లోల శ్రీనివాస్, కార్తీక్, ఆడే శ్రీనివాస్, ముఖేష్ సచిన్ తదితరులు పాల్గొన్నారు.