టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని సంస్థ యజమాని వేధింపులే కారణమని బంధువులు ఆరోపించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని టాంజానియానుంచి భారత్‌ తీసుకురావాలని కుటుంబీకులు అభ్యర్థిస్తున్నారు.